ప్రపంచ ఆరోగ్య సలహాదారుగా ఖమ్మం జిల్లా వాసి

Jan 7, 2024 - 18:02
 0  96
ప్రపంచ ఆరోగ్య సలహాదారుగా  ఖమ్మం జిల్లా వాసి

ప్రపంచ ఆరోగ్య సలహాదారుగా ఖమ్మం జిల్లా వాసి

 జనసాక్షి ఖమ్మం :ఖమ్మం పట్టణవాసికి అరుదైన గౌరవం దక్కింది. నగరానికి చెందిన ఐఏఎస్‌ అధికారి అడపా కార్తీక్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆసియా విభాగంలో సలహాదారుగా నియ మితులయ్యారు.

ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన కార్తీక్‌ 2007లో ఐఏఎస్‌ టాపర్‌గా నిలిచారు. అనంతరం పంజాబ్‌ కేడర్‌కు వెళ్లి అంచెలంచెలుగా ఎదిగాడు. ప్రస్తుతం అక్కడే ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి హోదాలో విధులు నిర్వహిస్తున్నారు.

ఉద్యోగం చేస్తున్న సమ యంలోనే అమెరికాలోని నార్త్‌ కరోలినా విశ్వవిద్యాల యంలో క్యాన్సర్‌ నిర్మూలన అంశంపై పీహెచ్‌డీ పూర్తి చేశారు. ప్రస్తుతం దిల్లీలోని సౌత్‌ బ్లాక్‌లో ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ కార్యాలయంలో రెండేళ్ల పాటు సలహాదారుగా బాధ్యతలు తీసుకోను న్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహాదారుగా కార్తీక్ నియామకం పట్ల అతని బంధువులు, ఖమ్మం జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow