నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపి చిత్తూరు జిల్లా ఎస్పి

2024 నూతన సంవత్సరం సందర్బంగా జిల్లా పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ శ్రీ వై.రిశాంత్ రెడ్డి, IPS గారు.
జనసాక్షి : చిత్తూరు
జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో నూతన సంవత్సరం 2024 వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ క్యాంపు ఆఫీస్ నందు ఎస్పీ గారు పాల్గొని కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ఏడాదిలో మరింత ఉత్సాహంతో సమిష్టిగా పని చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిద్దామని పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ క్యాంపు ఆఫీస్, స్పెషల్ బ్రాంచి, ఏ.ఆర్ అధికారులు, జిల్లా పోలీసు కార్యాలయాలలో పని చేసే సిబ్బంది, పోలీసు అధికారులు మరియు జిల్లాలోని పలువురు సి.ఐ లు, ఎస్సైలు సబ్ డివిజన్ వారీగా విచ్చేసి ఎస్పీ గారిని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ ఎల్.సుధాకర్, అడిషనల్ ఎస్.పి. SEB శ్రీమతి శ్రీలక్ష్మీ, ఏ.ఆర్. అడిషనల్ ఎస్పీ శ్రీ జి.నాగేశ్వర రావు, ఎస్.బి. డి.ఎస్.పి. శ్రీ శ్రీనివాస రెడ్డి, 3 సబ్ డివిజన్ పోలీసు అధికారులు, జిల్లా నందు గల అందరూ డిఎస్పీ లు, సర్కిల్ ఇన్స్పెక్టర్ లు మరియు ఎస్.ఐ.లు అందరూ పాల్గొన్నారు.
What's Your Reaction?






