నిద్రమత్తులో ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీ కొట్టిన కారు
నిద్రమత్తు.. కారు బీభత్సం
లారీని ఢీకొని డివైడర్ దాటిన కారు.. ఇద్దరికి గాయాలు
టంగుటూరు, శిఖర జనసాక్షి: నిద్రమత్తు ఓ కారు డ్రైవర్‌ను ప్రమాదానికి గురిచేసింది. టంగుటూరు వద్ద జాతీయ రహదారిపై, ఫ్లైఓవర్‌పై ముందు వెళ్తున్న లారీని కారు బలంగా ఢీకొట్టడంతో డివైడర్‌ను దాటి అవతలి రోడ్డుపైకి దూసుకెళ్లి ఆగింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ రూపేష్‌కు తీవ్ర గాయాలు కాగా, మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి.ఒంగోలు నుంచి కందుకూరు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న హైవే పోలీసులు, టంగుటూరు పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బంధువులు సంఘమిత్ర ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ప్రమాదంలో ఇద్దరూ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
What's Your Reaction?