దేశ రక్షణ నిధికి ప్రవీణ్ విరాళం అభినందనీయం- ఎమ్మెల్యే ఇంటూరి

May 10, 2025 - 14:45
 0  255
దేశ రక్షణ నిధికి  ప్రవీణ్ విరాళం అభినందనీయం- ఎమ్మెల్యే ఇంటూరి

దేశ రక్షణ నిధికి ప్రవీణ్ విరాళం అభినందనీయం – ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

- రూ.25,000 చెక్కును ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేత*

దేశ రక్షణ నిధికి కాకుమాని ప్రవీణ్ కుమార్ రూ.25,000 విరాళం ఇవ్వడం ఎంతో అభినందనీయమని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి  నాగేశ్వరరావు  అన్నారు. శనివారం కందుకూరు టీడీపీ కార్యాలయంలో  సత్య సాయి జ్యువెలర్స్ యజమాని కాకుమాని ప్రవీణ్ కుమార్  ఈ విరాళాన్ని చెక్కు రూపంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారికి అందజేశారు.. ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ రక్షణ కోసం 24 గంటలూ అప్రమత్తంగా ఉండే మన సైనికుల ధైర్య సాహసాలను మనం ఎప్పటికీ మరిచిపోవద్దు. వారు కాపాడే గౌరవంతోనే మనం కుటుంబ సభ్యులతో ప్రశాంత జీవితం గడుపుతున్నాం. దేశ భద్రత కోసం మనం చేసే సహాయం, విరాళాలు వారికి అండగా నిలుస్తాయని అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశ రక్షణ వ్యవస్థ బలోపేతంగా పనిచేస్తుంది అన్నారు...

కాకుమాని ప్రవీణ్ కుమార్  మాట్లాడుతూ, 1971లో భారత్ – పాకిస్తాన్ యుద్ధ సమయంలో అన్న ఎన్టీఆర్  ఏర్పాటు చేసిన నిధిని గుర్తు చేసుకుంటూ, ఆయన స్ఫూర్తితోనే నేను ఈ విరాళాన్ని అంద చేస్తున్నానని చెప్పారు.ఈ కార్యక్రమంలో కొత్తూరు వెంకట సుధాకర్, తాత లక్ష్మీనారాయణ, కోట వెంకట నరసింహం, కోటా కిషోర్, ఇమ్మడిశెట్టి సుబ్బరాయుడు, చక్కా వెంకట కేశవరావు, కంకణాల వెంకటేశ్వర్లు, కొత్త నరేంద్ర, ఇన్నమూరి నరసింహ, పబ్బిశెట్టి వరదరాజ, కటకం నరసింహారావు, గుర్రం అల్లూరయ్య, ఇస్కాల మధు, మద్ది ప్రసాద్, చల్లగాలి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow