తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి -సబ్ కలెక్టర్ హిమవంశీ

Oct 27, 2025 - 21:35
Oct 27, 2025 - 21:38
 0  271
తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి  -సబ్ కలెక్టర్ హిమవంశీ

తీర ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - సబ్ కలెక్టర్ హిమవంశీ

 గుడ్లూరు జన సాక్షి :

 బంగాళాఖాతంలో ఏర్పడిన  మోంథ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో మండలంలోని తీర ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కందుకూరు సబ్ కలెక్టర్ హిమ వంశీ తెలిపారు. మండలంలోని సాలిపేట, రావూరు, చేవూరు, ఏలూరు పాడు, కర్లపాలెం, బండ్లమాంబ ఆశ్రమ పాఠశాలను సబ్ కలెక్టర్ సోమవారం సందర్శించారు. ఆయా గ్రామాల ప్రజలతో ఆయన మాట్లాడి పలు సూచనలు చేశారు. తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. అత్యవసరం అయితే తప్ప రావద్దన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను తరలించడానికి పునరావాస కేంద్రాలు సిద్ధం చేశామన్నారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీ అధికారులు అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలన్నారు. సబ్ కలెక్టర్ వెంట తాహసిల్దార్ శ్రీనివాసరెడ్డి, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow