జీబీఎస్ తొలి మరణం - అప్రమత్తమైన ప్రభుత్వం

Feb 17, 2025 - 11:26
 0  423
జీబీఎస్ తొలి మరణం - అప్రమత్తమైన ప్రభుత్వం

గుంటూరులో కలకలం

జీబీఎస్ తొలి మరణం.. అప్రమత్తమైన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో తొలి గులియన్ బారే సిండ్రోమ్‌ (జీబీఎస్)తో ఓ మహిళ మృతి చెందింది.ఆదివారం గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతోన్న కమలమ్మ అనే మహిళ మరణించింది. రెండు రోజుల కిత్రం ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అలసందలపల్లిలో గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధి కలకలం రేగింది. ఆ గ్రామానికి చెందిన వృద్ధురాలు కమలమ్మకు ఈ వ్యాధి సోకింది. దీంతో తీవ్ర జ్వరంతో కాళ్లు చచ్చు పడిపోయాయి.ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారిందిదాంతో ఆమెను కుటుంబ సభ్యులు గుంటూరులోని జీజీహెచ్‌కు తరలించారు. కమలమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ వ్యాధి సోకి మరణించిన తొలి మహిళ కమలమ్మ మరణించడంతో.. ప్రభుత్వం అప్రమత్తమైంది. 

ఆ గ్రామంలో హుటాహుటిన వైద్యపరీక్షలు 

మరోవైపు సదరు గ్రామంలో ప్రజలకు వైద్యులు అన్ని పరీక్షలు నిర్వహించారు. కానీ ఎవరికీ వ్యాధి లక్షణాలు లేవని వైద్యులు వెల్లడించారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు బర్డ్‌ఫ్లూతో టెన్షన్‌ పడుతోన్నాయి. మరోవైపు గులియన్ బారే సిండ్రోమ్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. జీజీహెచ్ కు క్యూ కడుతున్నారుఇప్పటికే ఆసుపత్రిలో ఏడుగురు చికిత్స పొందుతున్నారు. మరికొందరి పరిస్థితి విషమంగా మారడంతో వారికి ఐసీఐలో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.

జిజిహెచ్ కు వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిష్ణ బాబు

గుంటూరు జీజీహెచ్ లో తోలి మరణం సంభవించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సెక్రటరీ కృష్ణ బాబు రెండు రోజుల క్రితం న్యూరాలజీ వార్డును 

సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. జిజిహెచ్ లో చేసిన ఏర్పాట్లపై సూపరింటెండెంట్ ను కృష్ణ బాబు అడిగి తెలుసుకున్నారు. బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యాధి నియంత్రణకు అన్ని విధాలుగా కృషి చేస్తుందని చెప్పారు.

ఆందోళన వద్దు:జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ యశస్వి 

జీబీఎస్ మృతికి సంబంధించి ఎవరు ఆందోళన గురి కావద్దని జీజీహెచ్ సూపరింటెండెంట్ అన్నారు. జీజీహెచ్ లో నాలుగు రోజుల్లో ఏడు కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇందులో ఇద్దరి డిస్చార్జ్ అయి వెళ్లిపోయారని తెలిపారు.ప్రజలు ఆందోళనకు గురి కావాల్సిన పని లేదన్నారు.

కాళ్లు, చేతులు చచ్చుపడినట్లు అనిపిస్తే వెంటనే ఆసుపత్రికి రావాలని సూచించారు.

దీనికి సంబంధించి వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. గతంలో వైరల్ జబ్బులు బారిన పడిన వారికి ఈ సిండ్రోం వచ్చే అవకాశాలు ఎక్కువ కరోనా బారిన పడిన వారిలో ఇప్పుడు ఈ సిండ్రోం కనిపిస్తోందన్నారు. జీజీహెచ్ న్యూరాలజి విభాగంలో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. జీజీహెచ్ కు ఇలాంటి కేసులు తరచుగా వస్తుంటాయని ఇప్పుడు వేరే జిల్లాల నుంచి కేసులు రావడంతో సంఖ్య పెరిగినట్లు కనిపిస్తుందిని వివరించారు. జీజీహెచ్ లో చేరిన 8 ఏళ్ల పాప ఈ సిండ్రోం నుంచి కోలుకుని డిస్చార్జ్ అయివెళ్లిపోయారని తెలిపారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow