చంద్రబాబు అంటే ఒక బ్రాండ్ -ఎంపీ వేమిరెడ్డి

కూటమి నాయకులు, కార్యకర్తలను ఎవరూ విడదీయలేరని, అది ఎవరికీ సాధ్యం కాదని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. కావలి నియోజకవర్గంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్, కావలి నియోజకవర్గం జనసేన ఇన్చార్జి అలహరి సుధాకర్ తదితరులు పాల్గొన ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నుంచి భారీగా నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ... తనను ఎంపీగా, కృష్ణారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రతి నాయకుడు కార్యకర్తను కలవాలనే ఉద్దేశంతో ఆత్మీయ సమావేశాలను రూపొందించామన్నారు. కూటమి ప్రభుత్వం ఇలాగే కలిసి నడవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని రేంద్ర మోడీ గారి సహకారంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారన్నారు. అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. వాటిని తెలియనియ్యకుండా పాలన సాగిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి ఎంపీతో ప్రత్యేకంగా చర్చించి ఆ నియోకవర్గాల్లో ఉన్న సమస్యలను తెలుసుకున్నారని చెప్పారు. ఒక్క నిమిషం కూడా ఖాళీగా లేకుండా పనిచేసే ఏకైక వ్యక్తి చంద్రబాబు ని కొనియాడారు. చంద్రబాబు అంటే ఒక బ్రాండ్ అని అన్నారు. మత్య్సకారులకు ఎన్నికల్లో ఇచ్చినహామీ మేరకు భృతిని 20 వేలు చేశారన్నారు. ఒక్క నెల్లూరు జిల్లాలోనే 12 వేలమందికి మత్స్యకార భృతి అందించారన్నారు. త్వరలోనే దగదర్తి ఎయిర్ పోర్ట్, బీపీసీఎల్ ఏర్పాటుతో కావలి జిల్లాకే తలమానికమవుతుందని చెప్పారు. కావలి నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఒకపక్క ప్రధాని మోడీ నాయకత్వంలో, మరోపక్క సీఎం చంద్రబాబు పాలనలో కావలి అనేక విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. కావలి కనకపట్టణం చంద్రబాబుగారితోనే సాధ్యమన్నారు. రామాయపట్నం పోర్టు, బిపిసిఎస్ కంపెనీ వంటి అనేక పెద్ద ప్రాజెక్టుల సాధనలో ఎంపీ వేమిరెడ్డి పాత్ర అమోఘమన్నారు. కుటుంబ సభ్యుల మధ్య, ఆత్మీయుల మధ్య పార్టీల నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశం గొప్ప అనుభూతిని ఇస్తుందన్నారు. కలిసిమెలిసి ముందుకు సాగేలా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూపొందించిన ఈ కార్యక్రమం చాలా గొప్పదని చెప్పారు. తాను రాసిన 3 లేఖలకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్పందించి సమస్యలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారన్నారు. ఎంపీ వేమిరెడ్డి కృషితో 17 కోట్ల నిధులు కావలికి వచ్చాయని చెప్పారు. దగదర్తి ఎయిర్పోర్ట్ ను భూసేకరణకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కృషితో 30 30 కోట్ల రూపాయలు వచ్చాయని చెప్పారు. కార్యక్రమం అనంతరం ఎంపీ వేమిరెడ్డిని ఘనంగా గజమాలతో సన్మానించారు.
What's Your Reaction?






