ఘనంగా పోతురాజు స్వామి పొంగళ్ళు

ఘనంగా పోతురాజు స్వామి పొంగళ్ళు
కందుకూరు జనసాక్షి :
కందుకూరు పట్టణంలోని పోతురాజు స్వామి గుడి వద్ద నెల పొంగళ్ళు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామ దేవతల వారసత్వ ధర్మకర్త దివి లింగయ్య నాయుడు పర్యవేక్షణలో స్వామివారి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. స్ధానిక ముత్తరాశిపాలెం ఆచార దేవర ఇంటి నుండి భోణం పొంగళ్ళు పెట్టి అక్కడ నుండి ఊరేగింపు నిర్వహించి పోతురాజు స్వామికి పొంగళ్ళు చెల్లించారు. ప్రజలు ప్రతీ ఇంట వారులు పోస్తూ పోతురాజుస్వామి వారి భోణం ఊరేగింపును జయప్రదం చేసారు. గ్రామ పోతురాజు, పోతురాజుస్వామికి చేసిన కత్తి సేవ, విద్యావంతులు చెప్పిన పోతురాజు స్వామి కధను భక్తులు ఆశక్తిగా తిలకించారు. దీవెన బండారు అనంతరం భక్తులు తీర్ధప్రసాదాలు స్వీకరించారు. పోతురాజు స్వామి ఆచార కార్యక్రమాలను సమర్ధవంతంగా చేసిన విధ్యావస్తుడు గొట్టిముక్కల గోవర్ధన్, కన్నమనీడు పల్నాటి చెన్నయ్య, రాధయ్య, పూజారులు మాల్యాద్రి, రామరాజు, గ్రామ పోతురాజు లకు దివి లింగయ్య నాయకుడు, పిడికిటి వెంకటేశ్వర్లు శాలువాతో సన్మానించారు. పోతురాజు స్వామి కార్యక్రమాలకు సహకారం అందిస్తున్న చికెన్ సెంటర్ సురేష్ రెడ్డి కి నిర్వాహక కమిటీ సత్కరించింది. కార్యక్రమంలో మాదాల మాల్యాద్రి, మంగపాటి కృష్టయ్య, పల్నాటి వీరుల ఆచారస్తులు చక్కా వెంకట కేశవరావు, చక్కా చెన్నకేశవరావు (శ్రీ లక్ష్మీ వాచ్), చక్కా సుబ్రహ్మణ్యం, మోసంగి ప్రసాద్, పిన్నంరాజు ప్రభాకర్, తొట్టెంపూడి వేణు, తల్లపనేని నరసింగరావు, బత్తిన కోటేశ్వరరావు, దామా మల్లేశ్వరరావు, మంగపాటి శ్రీను, మందలపు మాలకొండయ్య, మందలపు సుబ్బారావు, మంగపాటి శ్రీను, దావులూరి శేషమ్మ, గర్రం మల్లిఖార్జున, గుండవరపు శేషయ్య తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?






