ఘనంగా దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

ఘనంగా రాజీవ్ గాంధీ 80 వ జయంతి వేడుకలు
దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర్ రావు, మాజీ శాసనమండలి సభ్యులు పోట్ల నాగేశ్వరరావు, మాజీ శాసన మండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ తో కలిసి రాజీవ్ గాంధీ చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ..రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను గుర్తు చేశారు.
రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఆధునీకరణ, ఉదారీకరణలపై దృష్టి సారించింది. కంప్యూటర్లు, టెలికమ్యూనికేషన్లు వంటి రంగాలలో అతను అనేక ముఖ్యమైన సంస్కరణలను ప్రవేశపెట్టాడు. రాజీవ్ గాంధీని భారతదేశంలో సమాచార విప్లవ పితామహుడిగా పరిగణిస్తారు. దేశంలో కంప్యూటరైజేషన్, టెలికమ్యూనికేషన్ విప్లవం యొక్క ఘనత అతనికే చెందుతుంది. అతను విదేశీ విధానంలో చురుకైన పాత్ర పోషించాడు, శ్రీలంక, సోవియట్ యూనియన్ తో సంబంధాలను మెరుగుపరచడానికి కృషి చేశాడు. స్థానిక స్వపరిపాలన సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేశారు. రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయస్సును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించి యువతకు ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, అనుబంధ సంఘాల అద్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, బొడ్డు బొందయ్య,సయ్యద్ ముజాహిద్ హుస్సేన్,సయ్యద్ గౌస్,కార్పొరేటర్లు మలీదు వేంకటేశ్వరరావు, రాపర్తి శరత్, పల్లెబోయిన భారతి చంద్రం, ఆళ్ళ అంజిరెడ్డి, భూక్యా బాలాజి నాయక్, కొంటెముక్కల నాగేశ్వరరావు, భిక్షపతి రాథోడ్, శంకర్ నాయక్,అబ్బాస్ భాయ్, బాణాల లక్ష్మణ్,y శ్రీశైలం,నరాల నరేష్, గడ్డం వెంకటయ్య,ఫజల్, జహీర్ భాయ్, రజి, సాయి, సంపటం నరసింహరావు, కాళంగి కనకరాజు,, ముజాహిద్దీన్, గజ్జి సూర్యనారాయణ, శ్రీను, నూకారపు వెంకటేశ్వరరావు, పర్వత శ్రీను, బండి నాగేశ్వరరావు, బొజెడ్ల సత్యనారాయన, తవిడబోయిన రవి, భూక్య సురేష్ నాయక్, రమణ,నల్లమోతు రవి, ఏపూరి మల్లిఖార్జునరావు, మారం కరుణాకర్ రెడ్డి, నగేష్ , కందుకూరి వెంకటనారాయణ,ధనలక్ష్మి, భవాని, నసీమా, ఆదిలక్ష్మి, శ్రీకలారెడ్డి, కైసర్, సాయి, యశ్వంత్ తదితర నాయకులు పాల్గొన్నారు.
What's Your Reaction?






