కుక్కల దాడిలో 15 గొర్రెలు మృతి
కుక్కల దాడిలో 15 గొర్రెలు మృతి
గుడ్లూరు శిఖర జన సాక్షి :
కుక్కల గుంపు దాడిలో 15 గొర్రెలు మృతి చెందిన సంఘటన మండలంలోని జానకంపేట గ్రామంలో బుధవారం జరిగింది. వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గుండ్లపల్లి చిన్న బ్రహ్మయ్య గొర్రెలు, మేకలను మేపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. మంగళవారం తన గొర్రెలను, మేకలను ఇంటికి సమీపంలో ఉన్న దొడ్డిలో తొలి వచ్చాడు. గ్రామంలో తిరుగుతున్న కుక్కల గుంపు దొడ్డి లోకి చోరపడి గొర్రెలు, మేకల పై విచక్షణారహితంగా దాడి చేశాయి. వాటి దాడిలో 15 గొర్రెలు మేకలు మృత్యువాత పడ్డాయి. గొర్రెల అరుపులు విని అక్కడికి వెళ్లిన చిన్న బ్రహ్మయ్య గొర్రెలు చిందర వందరగా పడి మృతి చెంది ఉండడాన్ని గమనించాడు. వెంటనే విషయాన్ని పశుసంవర్ధక శాఖ సిబ్బందికి సచివాలయ సిబ్బందికి సమాచారం అందించాడు. వారు వచ్చి వాటిని పరిశీలించారు. కుక్కల దాడిలో జీవనాధారమైన గొర్రెలు మృతి చెందడం పై చిన్న బ్రహ్మయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. వాటి విలువ సుమారు రూ 1.5 లక్షలు ఉంటాయని బాధితుడు తెలిపాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని ఆయన కోరారు.
What's Your Reaction?