కందుకూరులో రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి పోలీసులు ఆర్థిక సహాయం

Mar 5, 2026 - 18:56
 0  30

రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుళ్ల కుటుంబానికి పోలీసుల ఆర్థిక చేయూత

- మరణించిన సహోద్యోగి కుటుంబానికి పోలీస్ సిబ్బంది అండగా నిలవడం అభినందనీయమైన విషయం - ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు

ఒంగోలు , జన సాక్షి :ప్రకాశం జిల్లా, కందుకూరు పోలీస్ స్టేషన్ లో 

విధులు నిర్వహిస్తున్న షేక్ సాజిద్ జనవరి 19 న కందుకూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ మరణించారు. తన కుటుంబానికి ఆర్థిక చేయూతగా 2009 బ్యాచ్‌కు చెందిన పోలీసు సిబ్బంది స్వచ్ఛందంగా సేకరించిన రూ.2,14,000ను గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ చేతుల మీదుగా కానిస్టేబుల్ తండ్రి బాషా కి అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మరణించిన కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ శాఖ ఎల్లప్పుడూ వారికి అండగా నిలుస్తుందని, ఏవైనా సమస్యలు ఉన్నా నేరుగా తనను సంప్రదించవచ్చని తెలిపారు. పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ చనిపోయిన పోలీసు సిబ్బంది కుటుంబాల సంక్షేమంకు అన్ని చర్యలు తీసుకొని వారికి అన్నీ విధాల అండగా ఉంటామని తెలిపారు. తమ సహోద్యోగి విధి నిర్వహణలో మరణించిన కుటుంబానికి పోలీసు సిబ్బంది ఆర్థిక సహాయం అందించి అండగా నిలవడం అభినందనీయమన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow