కందుకూరును ప్రకాశం జిల్లాలో యధావిధిగా కలపాలి

కందుకూరును ప్రకాశం జిల్లాలో యధావిధిగా కలపాలని, రాళ్లపాడుకు సముచిత స్థాయిలో త్రాగునీరు, సాగునీరు అందించాలని, శనివారం ఏఎంసి లో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడుని కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు కోరారు. ఈ సందర్భంగా ఇంటూరి మాట్లాడుతూ గత ప్రభుత్వ చారిత్రక తప్పిదమే కందుకూరును నెల్లూరు జిల్లాలో కలపడమన్నారు. ప్రజల ఆశయాలు, ఆకాంక్షల మేరకు తిరిగి కందుకూరును ప్రకాశంలో కలపాలని ఆయన ముఖ్యమంత్రి కి విన్నవించారు. స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా కందుకూరుకి ముఖ్యమంత్రి రావడం హర్షదాయకమన్నారు. వెనుకబడిన కందుకూరు నియోజకవర్గంనకు BPCL ను కేటాయించడం పట్ల ఎమ్మెల్యే నాగేశ్వరరావు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. కందుకూరు నియోజకవర్గం అభివృద్ధికి ముఖ్యమంత్రి ఉదారంగా సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమానికి విచ్చేసిన అశేష జనవాహీనికి ఎమ్మెల్యే ఇంటూరి కృతజ్ఞతలు తెలియజేశారు.
What's Your Reaction?






