అమరావతి రాజధాని పనులను పున: ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు

జనసాక్షి : అమరావతి రాజధాని పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం పున:ప్రారంభించారు. రాజధానిలో ఎపి సిఆర్డిఎ ప్రాజెక్ట్ కార్యాలయ భవన పనులను పూజలు చేసి తిరిగి ప్రారంభించారు. అనంతరం ఉండవల్లి తిరిగి వెళుతూ సీడ్ యాక్సిస్ రోడ్డు మీదుగా వెళ్లే విజయవాడ బైపాస్ రోడ్ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పి.నారాయణ, సిఆర్డిఎ అధికారులు పాల్గొన్నారు.
What's Your Reaction?






