అడవిలో దొరికిన గుడ్లు తీసుకొచ్చి కోడితో పొదిగించాడు

Aug 2, 2024 - 10:02
Aug 2, 2024 - 10:02
 0  1098
అడవిలో దొరికిన గుడ్లు  తీసుకొచ్చి కోడితో పొదిగించాడు

అడవిలో దొరికిన గుడ్లను తీసుకొచ్చి కోడితో పొదిగించాడు

 అల్లూరి జిల్లా ఏజెన్సీలో అరుదైన ఘటన కనిపించింది. కోడి పెట్టకు నెమలి పిల్లలు తోడయ్యాయి. నెమలి గుడ్లను కోడిపెట్ట పొదగడంతో.. ఆ గుడ్ల నుంచి ఐదు నెలలకు పిల్లలు పుట్టాయి.వాటిని ఆప్యాయంగా సాకుతోంది ఆ కోడి. కోడి తల్లితో చలాకీగా అటు ఇటు తిరుగుతూ నెమలి పిల్లలు సందడి చేస్తున్నాయి. జాతి వేరైనా గుడ్లను పొదిగి ఇలా తల్లీలా పిల్లలను సాకుతొంది. ఆ దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

కోడి, నెమలి జాతులు వేరు. అయినప్పటికీ ఆ నెమలి ప. వాటిని చూసేందుకు తరలివస్తున్నారు. ముద్దు ముద్దుగా అడుగులు వేస్తూ సందడి చేస్తున్న ఆ నెమలి పిల్లలను చూస్తూ ఆనందంతో ఎగిరి గంతులు వేస్తున్నారు పిల్లలు. జాతీయ పక్షి నెమలి.

నెమలి 1963 సంవత్సరంలో భారతదేశ జాతీయ పక్షిగా ప్రకటించబడింది. ఈ పక్షి భారతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 ప్రకారం రక్షించబడింది. షెడ్యూల్ 1 కు చెందిన పక్షి నెమలి. నెమళ్ళు గుంపులు గుంపులుగా తిరుగుతుంటాయి. ఆడ నెమలిని సిహాన్ అని కూడా అంటారు. నెమళ్ళను బంధించడం, రవాణా, వేటాడడం, క్రయవిక్రయాలు చేయడం నిషేధం… నేరం.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow