అసెంబ్లీ వద్ద తౌషిక్ తల్లిదండ్రులు నిరసన
అసెంబ్లీ వద్ద తౌషిక్ తల్లిదండ్రులు నిరసన.. న్యాయం చేయాలని వేడుకోలు..
తమ కుమారుడి మృతికి కారకులను శిక్షించాలని ఏపీ అసెంబ్లీ వద్ద తౌషిక్ తల్లిదండ్రుల నిరసనకు దిగారు. సింగరాయకొండ మండలంలోని శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ తమ కుమారుడు తౌషిక్ ను చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ అసెంబ్లీ వద్ద బైటాయించారు.మృతికి ఐదు నిమిషాల ముందు తమతో నవ్వుతూ మాట్లాడిన మా అబ్బాయిని చంపేసారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.కొంతమంది అధికారులు స్కూలు యజమాన్యంతో కుమ్మక్కై కేసును నీరుగారుస్తున్నారంటూ వాపోయారు. డబ్బులు తీసుకుని వెళ్ళిపోండని బెదిరిస్తున్నారని అన్నారు.మరొక బిడ్డకు ఇలాంటి పరిస్థితి రాకుండా శ్రీచైతన్య నవోదయ స్కూల్ గుర్తింపుని వెంటనే రద్దుచేసి తౌషిక్ మృతికి కారకులను తేల్చాలని కోరారు.సీఎం చంద్రబాబు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , నారా లోకేష్ బాబు తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.దీంతో అసెంబ్లీ వద్ద ఆందోళన చేస్తున్న తౌషిక్ తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్ చేసి తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు.
What's Your Reaction?