ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పి

Jun 24, 2026 - 15:05
Jun 24, 2026 - 15:07
 0  93
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పి

ఈ నెల 27వ తేదీన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కాలువ పనుల పురోగతిని పరిశీలించడంతో పాటు, వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న నేపథ్యంలో గంటావానిపల్లిలో చేపట్టిన ఏర్పాట్లు, భద్రతా చర్యలను జిల్లా కలెక్టర్  ఎం. విజయ సునీత, జిల్లా ఎస్పీ  హర్షవర్ధన్ రాజు బుధవారం పరిశీలించి, సభా ప్రాంగణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.హెలిప్యాడ్ ప్రాంతం, వీఐపీల వాహనాల రాకపోకలు, పార్కింగ్ ప్రాంతం,  పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి, అక్కడ ఏర్పాట్లను సమీక్షించారు. ఇంకా చేపట్టాల్సిన ప్రత్యేక చర్యలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి భద్రతా లోపాలు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించి, అవసరమైన చర్యలను చేపట్టాలని జిల్లా ఎస్పీ  పోలీస్ అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మార్కాపురం జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి  గూడూరి ఎరిక్షన్ బాబు, మార్కాపురం డీఎస్పీ యు. నాగరాజు, రెవెన్యూ అధికారులు, వెలిగొండ ప్రాజెక్టు అధికారులు, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ ఎం. శ్రీనివాసరావు, వై.పాలెం ఇన్‌స్పెక్టర్ కె. అజయ్ కుమార్, త్రిపురాంతకం సీఐ అసన్ తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow