బస్సు ఢీకొని రెండు గేదెలు మృతి - రైతుకు గాయాలు

Aug 21, 2026 - 07:12
Aug 21, 2026 - 07:14
 0  117
బస్సు ఢీకొని రెండు గేదెలు మృతి - రైతుకు గాయాలు

గుడ్లూరు శిఖర జనసాక్షి :రోడ్డు దాటుతున్న గేదెలను ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో రెండు గేదలు మృతి చెందగా రైతుకు తీవ్ర గాయాలు అయిన సంఘటన మండలంలోని పొట్లూరు గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. వివరాలు ప్రకారం గ్రామానికి చెందిన రైతు పులిపాటి కృష్ణయ్య తన గేదెలను పొలంలో మేపుకొని రాత్రి ఇంటికి తోలుకొని వస్తుండగా రోడ్డు దాటుతున్న గేదెలను కందుకూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తిరుపతి నుంచి వస్తూ గేదెలను ఢీ కొట్టింది. దీంతో రెండు గేదెలు అక్కడకక్కడే మృతిచెందగా మరో రెండు గేదెలు గాయపడ్డాయి. రైతు కృష్ణయ్య కు కూడా బస్సు తగలడంతో గాయాలయ్యాయి. రెండు గేదెల విలువ సుమారు రెండు లక్షల రూపాయలు ఉంటాయని కృష్ణయ్య తెలిపారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow