ప్రాణం పోయాల్సిన అంబులెన్స్- ఇద్దరు ప్రాణాలను తీసింది

Sep 22, 2026 - 13:21
Sep 22, 2026 - 13:24
 0  66
ప్రాణం పోయాల్సిన అంబులెన్స్- ఇద్దరు ప్రాణాలను తీసింది

మార్కాపురం శిఖర జనసాక్షి  : అత్యవసర సమయంలో ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగించే అంబులెన్స్‌ ప్రమాదానికి కారణమైంది. అంబులెన్స్‌ బైకును ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన గొల్లపల్లి వద్ద బ్రిడ్జి సమీపంలో  జరిగింది.మార్కాపురం జిల్లా త్రిపురాంతకం  మండలం సోమేపల్లి  గ్రామానికి చెందిన పల్లెపోగు ప్రసాద్, నార్నెపాటి కోటేష్ పనిమీద బైక్‌పై మార్కాపురం వైపు వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన సున్ని పెంటకు చెందిన అంబులెన్స్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు బాధిత బంధువులు తెలిపారు . ప్రమాదం అనంతరం అంబులెన్స్‌ను అక్కడే వదిలి డ్రైవర్ పరారైనట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఇద్దరి మృతితో సోమేపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow