టెంట్ కు అనుమతి లేదు- గొడుగులతో వినూత్న రిలే నిరాహార దీక్షలు చేపట్టిన వైసీపీ శ్రేణులు

Aug 7, 2026 - 12:25
 0  145
టెంట్ కు అనుమతి లేదు- గొడుగులతో వినూత్న  రిలే నిరాహార దీక్షలు చేపట్టిన వైసీపీ శ్రేణులు

టెంట్‌కు అనుమతి లేదు.. గొడుగులతో వినూత్న నిరసన చేపట్టిన వైసీపీ నేతలు

కందుకూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఇన్‌చార్జి బుర్రా  మధుసూ యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం రెండో రోజుకు చేరుకున్నాయి.పోలీసుల ఆంక్షల నేపథ్యంలో దీక్షా శిబిరానికి టెంట్ ఏర్పాటు చేయడానికి అనుమతి లేకపోవడంతో, మండుతున్న ఎండను సైతం లెక్కచేయకుండా గొడుగులు పట్టుకుని వైసీపీ నాయకులు, కార్యకర్తలు వినూత్నంగా నిరసన తెలిపారు. డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఎండ తీవ్రత మధ్య కూడా వెనక్కి తగ్గకుండా నిరసన కొనసాగించడం స్థానికుల దృష్టిని ఆకర్షించింది. ప్రభుత్వం వెంటనే స్పందించి డీఎస్సీ అక్రమాలపై నిష్పక్షపాత విచారణకు ఆదేశాలు ఇవ్వాలని వైసీపీ నేతలు కోరారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow