జూద క్రీడలు వద్దు సాంప్రదాయ క్రీడలే ముద్దు ప్రకాశం జిల్లా ఎస్పీ

జూద క్రీడలు వద్దు సంప్రదాయ క్రీడలే ముద్దు.
-కోడిపందాలు, జూదాలు తదితర అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు..*
-ముందుగా ప్రజలకు తదితర శాఖ అధికారులకు పోలీస్ సిబ్బందికి సంక్రాంతి శుభాకాంక్షలు.*
-ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్
జనసాక్షి :సంక్రాంతి పండగను పురస్కరించుకొని జిల్లాలోని పట్టణాలు, గ్రామాలు, శివార్లు ఇతర ప్రాంతాల్లో కోడి పందాలు, జూదాలు గుండాట నిర్వహించడం నిషేధమని, ఎవరైనా కోడి పందేలు, జూదాలు ఆడినా, ప్రోత్సహించినా చట్టపరమైన చర్యలు తప్పవని ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్ హెచ్చరించారు . సంక్రాంతి పండుగ నేపథ్యంలో సాంప్రదాయం క్రీడలు అయిన కబడ్డి, కోకో, బ్యాట్మెంటన్ లతో పాటుగా వాలీబాల్, ఫుట్ బాల్, క్రికెట్ మొదలగు క్రీడలు నిర్వహించుకోవాలని, పండగలను కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సంప్రదాయ క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చి సంక్రాంతి జరుపుకోవాలని, సాంప్రదాయ సంక్రాంతి క్రీడా పోటీలు ప్రజల్లో సహృద్భావ వాతావరణం పెంపొందిస్తాయన్నారు. ఎవరైనా జిల్లాలో కోడి పందేలు నిర్వహించినా, పందేలు నిర్వహణకు స్థలాలు, భూములు ఇచ్చిన, జూద క్రీడలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంట
What's Your Reaction?






