జింకకు శవ పరీక్ష నిర్వహించిన డాక్టర్ సుధాకర్
రోడ్డు దాటుతున్న జింకను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో తలకు బలమైన గాయమై మృతి చెందింది. ఈ సంఘటన అయ్యవారిపల్లి పంచాయతీ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం అయ్యవారిపల్లి గ్రామం పరిధిలో ని 167/B నేషనల్ హైవే దగ్గర రోడ్డు దాటుతున్న రెండు సంవత్సరాల ఆడ పొడ దుప్పి (జింక ) తలకు బలమైన గాయమై మరణించింది. ఫారెస్ట్ అధికారులు వలేటివారిపాలెం పశు వైద్య శాఖ సహాయ సంచాలకులు డా ఇ. చెన్నకేశవులకు సమాచారం ఇచ్చారు. వారి ఆదేశాల మేరకు పోకూరు పశు వైద్యులు డా. యస్. సుధాకర్ పొడ దుప్పికి శవ పరీక్ష నిర్వహించి అటవీ శాఖ అధికారులకు అప్పగించినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో మొబైల్ వెటరినరీ క్లినిక్ పశు వైద్యులు వాసంతి. సిబ్బంది కిరణ్, అభి, అటవీ శాఖ అధికారులు ఉన్నారు.
What's Your Reaction?