కన్న కూతురిపై కామ వాంఛ తీర్చుకున్న కసాయి తండ్రి

Oct 27, 2025 - 10:04
Oct 27, 2025 - 10:10
 0  268
కన్న కూతురిపై  కామ వాంఛ తీర్చుకున్న కసాయి తండ్రి

కన్న కూతురిపై కామవాంఛ తీర్చుకున్న కసాయి తండ్రి

కొండపి జనసాక్షి:: కామాంధుడైన ఓ తండ్రి కూతురరిపై లైంగికదాడి చేసి కామవాంఛ తీర్చుకున్నారు. కంటికి రెప్పలా చూసు కోవాల్సిన కన్న బిడ్డని ఓ కసాయి తండ్రి కామంతో కళ్ళు మూసుకు పోయి,ఆమె జీవితాన్ని చీదిమెసిన సంఘటన కొండపి మండలంలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రేమ్ కుమార్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని ఓ గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలిక, ఇటీవల తరచూ కడుపు నొప్పి అని చెప్పడంతో, ఆ బాలిక తల్లి ఒంగోలు ఆసుపత్రి తీసుకెళ్ళింది. అక్కడ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆ బాలికపై జరిగిన లైంగిక దాడి గురించి తల్లికి వివరించారు. దీంతో తల్లి కుమార్తెను నిలదీయడంతో, తనను ఇంట్లో ఎవరులేని సమయంలో తన తండ్రి తనను బలవంతం చేసాడని తెలిపింది. దాంతో తల్లి కొండపి పోలీసు స్టేషన్ ఫిర్యా దు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసుల నిందితుడు కోసం గాలింపు చేపట్టారు. విషయం బయట పడటంతో నిందితుడు పరారిలో ఉన్నాడు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow