కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 3 న మీకోసం కార్యక్రమం

Jul 1, 2026 - 18:24
Jul 1, 2026 - 18:25
 0  77
కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో  ఈనెల 3 న   మీకోసం కార్యక్రమం

• కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో' మీకోసం '• వినియోగించుకోవాలని ప్రజలకు కలెక్టర్ పిలుపు.

కందుకూరు నియోజకవర్గం, కందుకూరు సబ్ కలెక్టర్  కార్యాలయంలో ఈనెల 3వ తేదీన ' మీకోసం ' కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే ఈ కార్యక్రమంలో కందుకూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ పి .రాజాబాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెలలో ప్రతి శుక్రవారం ఒక నియోజకవర్గంలో 'మీకోసం ' కార్యక్రమం నిర్వహించాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  ఆదేశాలు జారీ చేసియున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 3వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు కందుకూరు సబ్ కలెక్టర్ వారి కార్యాలయంలో ' మీకోసం ' కార్యక్రమం జరుగుతుంది.                                                         విక్కిరాలపేట లో పల్లెనిద్ర.. ఈనెల 3వ తేదీ శుక్రవారం రాత్రి కందుకూరు మండలంలోని విక్కిరాలపేట గ్రామంలో జిల్లా కలెక్టర్ ' పల్లెనిద్ర ' కార్యక్రమం ఉంటుంది. గ్రామస్తులతో కలెక్టర్ ప్రత్యేకంగా మాట్లాడి స్థానిక సమస్యలను తెలుసుకుంటారు. రాత్రికి విక్కిరాలపేట గ్రామంలోనే బస చేసి శనివారం ఉదయం గ్రామంలో పర్యటిస్తారు. జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయికి వస్తున్న దృష్ట్యా ఈ కార్యక్రమాల ద్వారా తమ సమస్యలను ప్రజలు పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి వారి కార్యాలయం, ఒంగోలు వారిచే జారీ చేయడమైనది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow