కందుకూరు మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్లు ఖరారు
చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందోనని ఆసక్తికర చర్చ
కందుకూరు మున్సిపాలిటీకి త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో అధికారులు వార్డుల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేశారు. మొత్తం 40 వార్డులకు సంబంధించి రిజర్వేషన్ల వివరాలను వెల్లడించడంతో పట్టణంలో రాజకీయ సందడి నెలకొంది. దాదాపు 14 సంవత్సరాలుగా ఎన్నికలు జరగ కపోవడంతో ఈసారి ఎన్నికలపై రాజకీయ నాయకులు, ఆశావహులు, ప్రజల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలకు సంబంధించిన సమస్యల కారణంగా ఇన్నాళ్లూ ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ సమస్యలను అధిగమించి ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం కావడంతో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులుగా పోటీ చేయాలని భావిస్తున్న వారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మొత్తం 40 వార్డుల్లో 8, 10, 11, 26, 27, 36, 37, 39, 40 వార్డులు అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నాయి. జనరల్ మహిళలకు 4, 6, 12, 13, 15, 17, 21, 25, 31, 33, 35 వార్డులు కేటాయించారు. బీసీ జనరల్ కేటగిరీలో 1, 3, 16, 24, 29, 34, 38 వార్డులు ఉండగా, బీసీ మహిళలకు 5, 9, 19, 23, 28, 30 వార్డులు కేటాయించారు.అదేవిధంగా ఎస్సీ జనరల్ కేటగిరీలో 14, 22, 32 వార్డులు, ఎస్సీ మహిళలకు 7, 20 వార్డులు, ఎస్టీ జనరల్ కేటగిరీలో 18వ వార్డు, మహిళల కేటగిరీలో 2వ వార్డు కేటాయించినట్లు వెల్లడైన వివరాలు సూచిస్తున్నాయి.
చైర్మన్ పదవిపై ఆసక్తికర చర్చ..వార్డుల రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఇప్పుడు అందరి దృష్టి మున్సిపల్ చైర్మన్ పదవిపై పడింది. చైర్మన్ పదవిని ఎవరికి కేటాయిస్తారనే అంశంపై గత నెల రోజులకు పైగా పట్టణంలో విస్తృత చర్చ సాగుతోంది. ఆశావహులు, వారి అనుచరులు సోషల్ మీడియా వేదికగా తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటుండటంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది.చైర్మన్ పదవి రిజర్వేషన్ ఎవరికి అనుకూలంగా ఉంటుందనే దానిపై వివిధ రాజకీయ వర్గాలు తమ అంచనాలు వేసుకుంటున్నాయి. మరోవైపు వార్డుల రిజర్వేషన్లకు అనుగుణంగా పోటీకి సిద్ధమవుతున్న నాయకులు తమ రాజకీయ సమీకర ణాలను మార్చుకుంటున్నారు. దీంతో కందుకూరు మున్సిపాలిటీలో ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది. సుమారు 14 సంవత్సరాల విరామం తర్వాత మున్సిపల్ ఎన్ని కలు జరిగే అవకాశం ఏర్పడటంతో పట్టణంలో రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి. ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారు.. ఏ వార్డులో ఎవరు బరిలోకి దిగుతారు, చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుంది.. అనే ప్రశ్నలు ప్రస్తుతం కందుకూరు రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తు న్నా యి.మొత్తంగా వార్డుల రిజర్వేషన్ల ఖరారుతో ఎన్నికల ప్రక్రియపై ఆశలు పెరగగా మున్సిపాలిటీలో ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది.
What's Your Reaction?