కందుకూరు మున్సిపాలిటీ పీఠంపై ఉత్కంఠ!

Nov 13, 2026 - 10:22
 0  244
కందుకూరు మున్సిపాలిటీ పీఠంపై  ఉత్కంఠ!

కందుకూరు మున్సిపల్ పీఠంపై ఉత్కంఠ!

కూటమి చైర్మన్ అభ్యర్థిగా ఉప్పుటూరి శ్రీనివాసరావు పేరు తెరపైకి!

కందుకూరు శిఖర జనసాక్షి: కందుకూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. కూటమి తరఫున మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఉప్పుటూరి శ్రీనివాసరావు పేరు దాదాపు ఖరారైనట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈరోజు అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందన్న సమాచారంతో కందుకూరు రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అధికారిక ప్రకటన కోసం ఉత్కంఠగా ప్రజలు ఎదురుచూస్తున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow