ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్లో మార్పులు

Oct 28, 2026 - 16:25
 0  53
ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ  ఎన్నికల షెడ్యూల్లో మార్పులు

ఏపీ: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు

ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న  ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ తేదీలను రాష్ట్ర ఎన్నికల సంఘం సవరించింది. తాజా నిర్ణయం ప్రకారం నవంబర్ 5న పోలింగ్, నవంబర్ 7న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 3న పోలింగ్, నవంబర్ 5న కౌంటింగ్ నిర్వహించాలని నిర్ణయించారు.అయితే, మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ఒకే రోజు రావడంతో ఎన్నికల విధుల నిర్వహణకు అవసరమైన సిబ్బంది కొరత ఏర్పడే అవకాశం ఉందని అధికారులు భావించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు తేదీలను మార్చుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. తాజా షెడ్యూల్‌తో ఎన్నికల విధుల నిర్వహణలో సిబ్బందిని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు అవకాశం కలగనుంది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow