ఆటోమేటిక్ సెన్సార్ సిస్టం రద్దు చేయాలి - సీఐటీయూ

Oct 27, 2025 - 18:03
Oct 27, 2025 - 18:14
 0  77
ఆటోమేటిక్  సెన్సార్ సిస్టం రద్దు చేయాలి - సీఐటీయూ

ఆటోమేటిక్ సెన్సార్ సిస్టం (A T S) ను రద్దు చేయాలి... సీ ఐటీ యూ 

గుడ్లూరు.. అక్టోబర్ 27

ఆటో కార్మికులకు, పెను ప్రమాదంగా మారిన, ఆటోమేటిక్ సెన్సార్ సిస్టం (ఏ టి ఎస్) వెంటనే రద్దు చేయాలని, సీఐటీయూ జిల్లా కార్యదర్శి, జి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ పిలుపుమేరకు, గుడ్లూరు మండల కార్యాలయం వద్ద, సీ ఐటీయూ, ఎర్ర ప్రగడ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ధర్నాలో సీ ఐటీయూ జిల్లా కార్యదర్శి జి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల మూలంగా, రవాణా కార్మికులు ఆటో కార్మికులు దివాలా తీసే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఫిట్నెస్ సర్టిఫికెట్లు, గతంలో కందుకూరు ఆర్టీఓ కార్యాలయం వద్ద తీసుకునేవారని, అక్కడనుండి నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కప్పలదరువు వెళ్లి ఫిట్నెస్ సర్టిఫికెట్లు తీసుకోవాలంటే, కార్మికులకు , చాలా ఇబ్బందికరంగా ఉంటుందని, వెంటనే ఈ విధానాలను మార్చి, సెంటరును రద్దు చేయాలన్నారు. వాహనదారుల సేవలను ప్రైవేటుపరం చేసి, ఆటో కార్మికుల వద్ద వేల రూపాయలు గుంజడం న్యాయమా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ విధానాలు కొనసాగితే ఆటో కార్మికులు పస్తులతో అలమట్టించి ఆత్మహత్యల పాలు కావడం ఖాయమని అన్నారు. వాహనదారుల సేవలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టకుండా, ప్రభుత్వమే అందించాలని, ఏటిఎస్ సెంటర్ ను రద్దు చేయాలని, ఫిట్నెస్ సర్టిఫికెట్లు ప్రభుత్వమే అందజేయాలని, చదువుతో నిమిత్తం లేకుండా లైసెన్సులు ఇవ్వాలని, తదితర డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని, గుడ్లూరు ఎంపీడీఓ  వై వెంకటేశ్వరరావు, గుడ్లూరు మండల డిప్యూటీ తాసిల్దార్ శ్యాం సన్ కి వినతి పత్రం అందజేశారు. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow